Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మంత్రి, భార్య, కొడుకు… సకుటుంబ, సపరివార, ‘సంయుక్త’ ఓటు!

ఈ వార్తకు ఎక్కువ ఉపోద్ఘాతం అవసరం లేదు. ఒక మంత్రి తన ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి సంయుక్తంగా ఓటు వేయడమే అసలు విశేషం. శుక్రవారం జరిగిన కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్ తన భార్య రజిత, కుమారుడు హరిహరన్ తో కలిసి సంయుక్తంగా ఓటు వేస్తున్న దృశ్యాలు తెలంగాణాలో రాజకీయ కలకలానికి దారి తీశాయి.

కరీంనగర్ నగరపాలక సంస్థలోని 24వ డివిజన్లో మంత్రి కమలాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన తీరుపై, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. తాను కారు గుర్తుకే ఓటు వేశానని, ఓటర్లంతా కారు గుర్తుకే ఓటు వేయాలని గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కమలాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేస్తున్న దృశ్యాలను ఎగువ, దిగువన కూడా చూడవచ్చు.

Popular Articles