Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘ఇత్తేసి పొత్తు’… బీజేపీపై ‘కామ్రేడ్’ ఎర్రబెల్లి ధ్వజం

‘ఇత్తేసి పొత్తు’ కూడిన చందంగా బీజేపీ వ్యవహారం ఉందని తెలంగాణా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కొందరు బీజేపీ నాయకుల తీరు ఇదే తరహాలో విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. ‘ఇత్తేసి పొత్తు’ అనే రెండు పదాల వాక్యపు నిర్వచనం విషయానికి వస్తే… ఏదేని భారీ ధాన్యపు పంట కుప్పలో ఓ గింజను కలిపేసి వాటా ఉందని వాదించే తీరుకు తెలంగాణా మాండలికంలో బహుళ ప్రాచుర్యంలో గల ఈ సామెతను అన్వయిస్తుంటారు. రాష్ట్రంలో బీజేపీ నాయకుల వ్యవహార తీరు కూడా ఇదే తరహాలో ఉందని మంత్రి వ్యాఖ్యానించడం విశేషం.

తెలంగాణ ప్ర‌భుత్వం చేసే సాయంలో ఏదో కొద్దిగా ఇచ్చేసి కేంద్రం చేతులు దులుపుకొంటుంటే, బీజెపీ మాత్రం మొత్తం తామే ఇస్తున్నామ‌ని డాంబికాలు ప‌లుకుతోందని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా గీసుకొండ మండ‌లం కోనాయి మాకుల‌లో మేడే సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ‘ఎర్ర జెండా’ను ఆవిష్క‌రించారు. అనంత‌రం వ‌ల‌స కూలీలకు, కార్మికులకు, ఆటో డ్రైవ‌ర్లకు, నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేసి మంంత్రి మాట్లాడారు.

కోనాయి మాకులలో మంత్రి వ్యాఖ్యల వీడియో

ఈ సంద‌ర్భంగా బీజెపీ వ్య‌వ‌హార శైలిపై మంత్రి తనదైన శైలిలో తుర్పార ప‌ట్టారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోల‌మ‌వుతున్నా, సీఎం కేసీఆర్ నానా ఇబ్బందులు ప‌డి పెన్ష‌న్లు ఇస్తున్నారని చెప్పారు. మొత్తం పెన్ష‌న్లకు రూ. 12 వేల కోట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఇస్తుంటే, అందులో కేవ‌లం రూ. 200 కోట్లు మాత్ర‌మే ఇస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం, ఆ పెన్ష‌న్ల‌న్నీ తామే ఇస్తున్న‌ట్లు ప్ర‌గ‌ల్బాలు ప‌లుకుతోందని విమర్శించారు. బీజేపీ నాయకుల తీరు విచిత్రంగా ఉంద‌న్నారు. బీజేపీ నాయకులు ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెప్పాల‌ని, త‌ప్పుదోవ ప‌ట్టించొద్ద‌ని ఎర్రబెల్లి సూచించారు.

Popular Articles