బీజేపీకి చెందిన మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు భద్రతపై తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రఘునందన్ రావుకు భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మావోయిస్ట్ పార్టీ నక్సల్స్ పేరుతో ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి రఘునందన్ రావుకు బెదిరింపు ఫోన్లు వచ్చిన సంగతిత తెలిసిందే. ఈ ఉదంతంపై విచారణ జరిపిన తర్వాత ఆయనకు మరింత భద్రత అవసరమని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఆయన పర్యటనల్లో ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలని రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలోని ముగ్గురు ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
