Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

జీవో నెం. 49 రద్దు

జీవో నెం. 49పై తెలంగాణా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పులుల సంరక్షణ కోసం తీసుకువచ్చిన జీవో నెం. 49 పై ఆదివాసీల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో టైగర్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 49 జీవోను విడుదల చేసింది. అయితే ఈ జీవో కారణంగా ఆదివాసీల జీవన మనుగడకే ప్రమాదం ఏర్పడిందనే విమర్శలు వచ్చాయి. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ సోమవారం అదిలాబాద్ జిల్లా బంద్ నిర్వహించింది. బంద్ కు వివిధ రాజకీయ పక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఇంకోవైపు మావోయిస్టు పార్టీ కూడా ఈ జీవోను వ్యతిరేకించాలని, రద్దు చేసే వరకు ప్రజాప్రతినిధులు పోరాడాలని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే జీవో నెం. 49ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. జీవోను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.  

Popular Articles