Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

ఫోన్ ట్యాపింగ్ పై మరో ‘సిట్’ ఏర్పాటు!

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణా ప్రభుత్వం సరికొత్త అడుగు వేసింది. ఇందులో భాగంగానే కేసు దర్యాప్తు కోసం తాజాగా మరో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను నియమించింది. మొత్తం తొమ్మిది మంది పోలీసు అధికారులతో సిట్ ను ఏర్పాటు చేశారు. సిట్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ నాయకత్వం వహిస్తారు. ఈమేరకు డీజీపీ శివధర్ రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వు జారీ చేశారు.

సిట్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సిట్ లో ఐపీఎస్ అధికారులు అంబర్ కిషోర్ ఝా, ఎస్ఎం విజయ్ కుమార్, రితిరాజ్, కె. నారాయణరెడ్డి, గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీ హిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి, మరో ఇద్దరు డీఎస్పీలు సీహెచ్ శ్రీధర్, నాగేందర్ రావులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అభియోగాలపై నిరుడు మార్చి 10వ తేదీన కేసు నమోదు, తదనంతర పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసు నమోదై 21 నెలల తర్వాత ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కేసులో సిట్ ఛార్జిషీట్ ను దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

Popular Articles