హైదరాబాద్ పాతబస్తీకి చెందిన సింగర్ రాహుల్ సిప్లీగంజ్ కు తెలంగాణా ప్రభుత్వం బంపర్ గిఫ్ట్ ను ప్రకటించింది. పాతబస్తీ బోనాల సందర్బంగా రాహుల్ సిప్లీ గంజ్ కు కోటి రూపాయల నగదు నజరానాను ప్రభుత్వం ప్రోత్సహకంగా ప్రకటించింది. గద్దర్ అవార్డుల ప్రదానం సందర్భంగా రాహుల్ సిప్లీ గంజ్ టాలెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందేజ
రాహుల్ కు గద్దర్ అవార్డుల్లో ఎటువంటి స్థానం దక్కలేదని, అతని ప్రతిభకు తగిన అవార్డుగాని, ఏదేని ప్రోత్సాహకం గాని అందించే విషయాన్ని ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల సభా వేదికపైనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సూచించారు. ఈ నేపథ్యంలోనే పాతబస్తీ నుంచి ఆస్కార్ అవార్డు వరకు ఎదిగిన తెలంగాణా సింగర్ రాహుల్ సిప్లీ గంజ్ కు కోటి రూపాయల నగదు నజరానాను ప్రభుత్వం ప్రకటించడం విశేషం.
