తెలంగాణాలో యూరియా కొరతకు అద్దం పట్టే చిత్రాలివి. అదును సమయంలో యూరియా లభించకపోవడంతో మొక్క జొన్న చేను ఎదగలేదు. ఒకవేళ ఇప్పుడు యూరియా దొరికినా ఫలితం లేదు. చేనుకు చేవనిచ్చే సమయం దాటిపోయింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఎదగని తన మొక్కజొన్న చేనులోకి పశువులకు మేతకోసం తోలారు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ కు చెందిన రైతు శివరాత్రి శ్రీకాంత్. మరోవైపు యూరియా కోసం రైతన్నలు అర్థరాత్రి, అపరాత్రి అనే భేదం లేకుండా బారులు తీరుతున్న దృశ్యాలు రాష్ట్రంలో అనేకచోట్ల ఇంకా సాక్షాత్కరిస్తూనే ఉన్నాయి.

