గుండెపోటుతో డీఎస్పీ విష్ణుమూర్తి హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న విష్ణుమూర్తి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లోనే సోమవారం ఆయన గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి చెందిన పోలీసు అధికారి విష్ణుమూర్తి. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కాగా డీఏస్పీ విష్ణుమూర్తి భౌతికకాయానికి మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు.
