హైదరాబాద్: తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం వధువు సాక్షితో గురువారం ఘనంగా జరిగింది. శంషాబాద్ లోని జీఎంఆర్ ఎరీనా ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డీజీపీ శివధర్ రెడ్డి, అదనపు డీజీ మహేష్ భగవత్, సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖులు చిరంజీవి, అక్కినేని నాగార్జున, హీరో శ్రీకాంత్, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

