Top 5 This Week

Related Posts

బ్యాంకర్ల ఆందోళనపై భట్టి భరోసా

హైడ్రా విషయంలో బ్యాంకర్ల ఆందోళనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా కల్పించారు. హైడ్రా అంశంలో బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని స్పష్టతనిచ్చారు. ప్రజాభవన్ లో బుధవారం బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం నిర్వహించారు.

జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ వంటి అనేక ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించి నిర్మాణాలకు అనుమతులు ఇస్తాయని చెప్పారు. అందువల్ల హైడ్రా చర్యలపై బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇచ్చిన రుణాల రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉందని, వారికి పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని భట్టి విక్రమార్క బ్యాంకర్లకు సూచన చేశారు.

Popular Articles