హైదరాబాద్: మొంథా తుపాన్ వరద ప్రాంతాల్లో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈమేరకు అధికార ప్రకటన వెలువడింది. ఈ ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను, పంట నష్టం వాటిల్లిన క్షేత్రాలను సీఎం రేవంత్ పరిశీలిస్తారు.
గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారని, ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి వాతావరణం అనుకూలించకపోవటంతో హెలీకాప్టర్ ప్రయాణం వీలు కాదని, ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదని చెప్పాయి. అందువల్ల వాతావరణం అనుకూలించకపోవటంతో తాను గురువారం వరద ప్రభవిత ప్రాంతాలకు రాలేకపోయానని, శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వస్తానని వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ ప్రకటించారు.

