Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

రేషన్ కార్డులు, ఇసుక దందాపై సీఎం కీలక ఆదేశాలు

కొత్త రేషన్ కార్డుల జారీ, ఇసుక వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సివిల్ సప్లయిస్ శాఖపై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పలు జిల్లాల్లో కోడ్ అమలులో ఉన్నందున, ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అనేక డిజైన్లను సీఎం పరిశీలించారు.

కాగా మరోవైపు ఇసుక అక్రమ రవాణా అంశంలోనూ సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం మోాపాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇసుక రీచ్ లను తనిఖీ చేయాలన్నారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణా దందాపై దాడులు చేయాలని విజిలెన్స్ విభాగపు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ సంబంధిత ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు.

Popular Articles