సీఎల్పీలో సీఎం రేవంత్ స్పీచ్ పాయింట్స్
- ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
- ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.
- సన్నబియ్యం పథకం ఒక అద్భుతం.
- ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకం.
- భూ భారతిని రైతులకు చేరవేయాలి.
- దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచింది.
- క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలి.
- దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
- కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించాం.
- విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చాం.
- ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనం.
- జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం.
- అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
- మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
- రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలి.
- నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తా.
- హెచ్ సీ యూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసింది.
- ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారు.
- బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి.
- పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది..
- మనం ఎంత మంచి చేసినా, ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదు.
- మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
- మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి.
- ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.
- నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు.
- ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు.
- తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి, బిక్కిరి అవుతున్నారు.
- వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది.
- కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోంది
- దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది.
- అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెస్ ఒక్కటయ్యాయి.
- సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి..
- సన్న బియ్యం మన పథకం, మన పేటెంట్, మన బ్రాండ్.
- ఎమ్మెల్యేల తీరు పై సీఎం సీరియస్.
- కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు జనాల్లోకి తీసుకువెళ్ళండి.
- గెలిచాము కదా? మన అయిపోయింది అనుకుంటే తప్పు. మరోసారి గెలిచే విధంగా పని చేయండి.
- సన్నబియ్యం, భూ భారతి, ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన,ఇందిరమ్మ ఇండ్లు,రైతు రుణమాఫీ, రైతు బంధు, బోనస్, ఫ్రీ బస్, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాలపై ఎక్కువ ప్రచారం చేయండి.
- స్థానిక సంస్థల ఎన్నికలో ఎక్కువ మన మద్దతు దారులను గెలిపించండి.
- ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎక్కడికడ తీవ్రంగా ఖండించండి. ప్రెస్ మీట్లు పెట్టి తిప్పి కొట్టండి. ఆధారాలతో వివరాలు బయట పెట్టండి
- అద్దంకి దయాకర్ పై సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్.
- పార్టీలో అద్దంకి దయాకర్ లాగా ఓపికగా ఉండాలి.
- అద్దంకికి ముందు ఎమ్మెల్యే ఇద్దాం అనుకున్నాం.. కుదరలేదు.
- ఓపికతో అద్దంకి దయాకర్ ఉన్నాడు కాబట్టే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు.
- అద్దంకి తన జీతం 10% ఏఐసీసీకి, 15% పీసీసీకి ఇస్తున్నారు.
- ఎమ్మెల్యేలు తమ జీతం నుండి సీఎల్ప్పీకి రూ. 10వేలు, పార్టీకి రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని పీసీసీ నిర్ణయం.