Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

అపాయింట్మెంట్ ప్లీజ్

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ కోరారు. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి శాసనసభ రెండు వేర్వేరు బిల్లులను ఆమోదించిన నేపథ్యంలో సీఎం ప్రధాని అపాయింట్ మెంట్ కోరారు. తెలంగాణ శాసనసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం, సీపీఐ నాయకుల బృందంతో కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మద్దతు కోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రధానమంత్రిని కలుద్దామని ఈ రెండు బిల్లులపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం చేసిన ప్రతిపాదనపై అన్ని పక్షాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు బిల్లులపై కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి తన లేఖలో ప్రధానిని కోరార.

Popular Articles