రాష్ట్ర అభివృద్దిపై చర్చించేందుకు ఎర్రవల్లి ఫాం హౌజ్ కే తాను వస్తానని సీఎం రేవంత్ రెడ్డ ప్రకటించారు. తనకేమీ భేషజాలు లేవని, కేసీఆర్ కు ఇబ్బంది లేకుండా ఫాం హౌజ్ లోనే చర్చ పెడదామని అన్నారు. కేసీఆర్ తనకంటే సీనియర్ అని, తాను కూడా రావాలని కేసీఆర్ భావిస్తే తప్పకుండా వెడతానన్నారు. ఎర్రవల్లి ఫాం హౌజ్ లోనే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామని రేవంత్ అన్నారు. ఎర్రవల్లిలో జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి తాను కూడా వెడతానని చెప్పారు. ఎర్రవల్లిలో జరిగే భేటీకి కేసీఆర్ తేదీ నిర్ణయించి చెప్పాలని కోరారు. పబ్బులు, క్లబ్బులకు మొదటి నుంచీ తాను దూరమని, అటువంటి ప్రాంతాలకు తాను వెళ్లనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు.


