Top 5 This Week

Related Posts

కేసీఆర్ పాపాల చిట్టా విప్పుతా: సీఎం రేవంత్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దాచేది ఏమీ లేదని, ఉన్నది ఉన్నట్టుగానే చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా తాను చెప్పిన ఆర్థిక పరిస్థితి అంశాలు ఇంటర్వెల్ మాత్రమేనని, సగం మాత్రమే చెప్పానన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఈనెల 19, 20 తేదీల్లో మిగతా కతంతా చెబుతానని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన పాపాల చిట్టాను విప్పుతానని, ప్రజలంతా తప్పకుండా వినాలని సీఎం కోరారు.

అదేవిధంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. త్యాగధనులు జాతిపితలు అవుతారే తప్ప, తాగుబోతులు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణాకు జాతిపిత ఏ ప్రాతిపదికన అవుతారని నిలదీశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లోని శివునిపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సబలో సీఎం రేవంత్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల పూర్తి ప్రసంగాన్ని దిగువన గల వీడియోలో చూడవచ్చు..

Popular Articles