తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జపాన్ లో ఘన స్వాగతం లభించింది. సీఎం నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ టీంకు ఘన స్వాగతం లభించించి. టోక్యోలోని వందేళ్ల చరిత్ర కలిగిన ఇండియా హౌస్‌లో జపాన్‌లోని భారత రాయబారి శిబు జార్జ్ తెలంగాణ ప్రతినిధి బృందాన్ని స్వాగతించి, వారికి ఘనంగా విందు ఇచ్చారు.

జపాన్ లోని భారత రాయబారితో ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా సమకాలీన అంశాలపై చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి కరుణానిధి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, మాజీ ఎంపీ నెపోలియన్, సీఎం చీఫ్ సెక్రటరీ శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు