Top 5 This Week

Related Posts

‘స్వామి’తో కేసీఆర్ భేటీ

బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామితో తెలంగాణా సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అదేవిధంగా భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ తో కూడా సీఎం సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మధ్యహ్న భోజనాన్ని సుబ్రహ్మణ్యస్వామి, టికాయత్ లు స్వీకరించారు.

కాగా వారణాసిలో సీఎం కేసీఆర్ కు ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం గమనార్హం.

Popular Articles