భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలంగాణాకు సాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరారు.
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి కేసీఆర్ లేఖ రాశారు.భారీ వర్షాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా 2020-21 యాసంగి సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరి పంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసే విధంగా నిర్ణీత పంటల సాగు విధానం ఖరారైంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణీత పంటల సాగుపై సమీక్ష నిర్వహించారు.