తెలంగాణా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 6వ తేదీన జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్ లో జరిగే కేబినెట్ మీటింగులో అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రవేశపెట్టాల్సిన బిల్లులు తదిర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
అంతేగాక ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన సర్వే, ఇందిరా మహిళా శక్తి పథకం, రాష్ట్రంలోని ముఖ్య దేవాలయాలకు బోర్డుల ఏర్పాటు, దేవాదాయ శాఖ సవరణ బిల్లు వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

