Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘రైతు భరోసా’పై బడ్జెట్ లో కీలక నిర్ణయం

రైతు భరోసా పథకానికి ఎటువంటి ఢోకా లేదని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు బుధవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో నిధులను కేటాయించడం గమనార్హం. రైతు భరోసా నిధుల విడుదల అంశంపై రాష్ట్ర రైతాంగం తీవ్ర అసంతృప్తిలో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఆయా పథకానికి వచ్చే వార్షిక బడ్జెట్ లోనూ నిధులు కేటాయించడం విశేషం. గత రబీ సీజన్ రైతు భరోసా నిధులను ఈనెల 31వ తేదీలోపి విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బడ్జెట్ లో వచ్చే వార్షిక ఏడాదిలోనూ నిధులు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పారు. రాష్ట్రంలోని రైతులు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసేందుకు, పెట్టుబడి సాయంగా తమ ప్రభుత్వం గత జనవరి 26 తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకం కిద రైతులకు ఏడాదికి, ఎకరానికి 12 వేల రూపాయలు అందుతాయన్నారు.

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి, గ్రామ సభలలో ధృవీకరించి, సాగుకు యోగ్యంకాని భూమిని గుర్తించడం ద్వారా, ఈ వృధాను అరికట్టామన్నారు. రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్ల (18,000 కోట్లు) రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

    Popular Articles