Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఏసీబీ దూకుడు: 20 మంది ప్రభుత్వ అధికారుల అరెస్ట్

తెలంగాణా రాష్ట్ర ఏసీబీ విభాగం దూకుడును ప్రదర్శిస్తోంది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్ ఇంట్లో సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గడచిన ఏప్రిల్ నెలలో తాము సాధించిన పురోగతిపై అవినీతి నిరోధక శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా ప్రకటనలోని సారాంశం ప్రకారం..

గత ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ 21 కేసులను నమోదు చేసింది. ఇందులో 13 కేసుల్లో అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులను వలపన్ని పట్టుకోగా, రెండు కేసులలో ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొన్నారు. అదేవిధంగా మరో రెండు క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు, ఇంకో రెండు రెగ్యులర్ విచారణ, ఆకస్మిక తనఖీల్లో మరో రెండు కేసులు నమోదు చేశారు.

గత నెలలో నమోదు చేసిన ఆయా కేసుల్లో వివిధ హోదాల్లో గల మొత్తం 20 మంది ప్రభుత్వ ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. వలపన్ని పట్టుకున్న కేసుల్లో రూ. 5.02 లక్షల నగదును సీజ్ చేశారు. ఓ కేసులో రూ. 3.51 కోట్ల విలువైన అక్రమాస్తులను కనుగొన్నారు. మరో కేసులో రూ. 13.50 కోట్ల విలువైన ఆక్రమాస్తులను గుర్తించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమ శాఖకు చెందిన టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేయాల్సిందిగా ఏసీబీ కోరింది. బాధితుల, ఫిర్యాదుదారులు పేర్లు రహస్యంగా ఉంటాయని స్పష్టం చేసింది.

Popular Articles