Sunday, January 25, 2026

Top 5 This Week

Related Posts

అంబులెన్సులను అందజేసిన మంత్రి కేటీఆర్

తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కరోనా పరీక్షల నిమిత్తం సొంత డబ్బులతో సమకూర్చిన 6 అంబులెన్సులను (Covid Responce Vehicle) గురువారం ప్రగతి భవన్ లో ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు ఆయా అంబులెన్సులను వారు హైదరాబాద్ లో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ నెల 24న తన జన్మదినం సందర్భంగా giftasmile కార్యక్రమంలో భాగంగా ఆరు అంబులెన్సులను ప్రభుత్వ దవాఖానాలకు విరాళంగా ప్రకటించిన కేటీఆర్‌ అత్యవసర ప్రాతిపదికన వాటిని ఏర్పాటు చేశారు. నేటి నుండే ఆయా అంబులెన్సులు వినియోగంలోకి రానున్నాయన్నారు.

టీఆర్ఎస్ తరుపున పార్టీ శ్రేణులు సైతం ముందుకు రావాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు, నాయకులు కేటీఆర్‌ ను కలిసి #giftasmile కింద అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి మొత్తం వంద అంబులెన్సులు అందజేసేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారని, తాను తీసుకున్న నిర్ణయానికి ఇంతలా స్పందన వస్తుందని ఊహించలేదని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా‌ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Popular Articles