హైదరాబాద్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై నిన్నటి దాడి, పోలీసుల కాల్పుల ఘటనలో ఇద్దరు గన్ మెన్లపై శాఖాపరంగా వేటు పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాల్పులు జరిపిన ఇద్దరు గన్ మెన్లను సిటీ ఆర్ముడ్ రిజర్వ్ కమాండెంట్ కు సరెండర్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కాల్పుల సందర్భంగా గన్ మెన్లు వ్యవహరించిన తీరు, కాల్పులకు ఎవరు ఆదేశించారనే అంశంపై పోలీసు ఉన్నతాధికారులు స్టేట్ మెంట్లను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెబితేనే తాము కాల్పులు జరిపామని గన్ మెన్లు విచారణాధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తున్న సమాచారం ధ్రువపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి ఘటనలో కాల్పులు జరిపిన ఇద్దరు గన్ మెన్లను సిటీ ఆర్ముడ్ రిజర్వు కమాండెంట్ కు సరెండర్ చేసినట్లు తెలుస్తోంది.



