ఆరోగ్యశ్రీ సేవలపై తెలంగాణా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేసింది. నేటి (మంగళవారం) అర్థరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు TANHA ప్రకటించింది. ఈ పథకం కింద రావలసిన భారీ మొత్తపు బకాయిల కోసం ఆరోగ్యశాఖ మంత్రిని, ఆరోగ్యశ్రీ సీఈవోలను కలిశామని, అయినా తమ బకాయిల సమస్యలు పరిష్కారం కాలేదని, దీంతో విధిలేక ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు TANHA ప్రకటించింది. అయితే ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ అసుపత్రులతో ఇటీవల జరిగిన చర్చల అనతరం రూ. 140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చి, నిన్న రూ. 100 కోట్లు విడుదల చేశామని, మరో రూ. 40 కోట్లు త్వరలో విడుదల చేస్తామని వైద్య వర్గాలు చెబుతుండగా, ప్రభుత్వం నుంచి తమకు రూ. 1,400 కోట్ల వరకు బకాయిలు రావలసి ఉందని ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల నిర్వాహకులు పేర్కొంటుండడం గమనార్హం.


