(By డా తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి)
రావి నారాయణరెడ్డి ఫేక్
బద్దం ఎల్లారెడ్డి ఫేక్
భీంరెడ్డి నరసింహారెడ్డి ఫేక్
ఆరుట్ల రామచంద్రారెడ్డి ఫేక్
అంటూ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు నయా జాదూగాళ్లు కొత్త చరిత్రలు మొదలుపెట్టారు. విసునూరు రామచంద్రారెడ్డిని గుర్తుంచుకున్నంత గొప్పగా వీళ్ళు పోరాట వీరుల్ని గుర్తించుకోలేకపోతున్నారు. వాళ్ళ పేర్లను పలకడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అంతే కాదు విసునూరు రామచంద్రారెడ్డి దగ్గర అనుచరులుగా కొనసాగిన వారి గురించి కూడా మాట్లాడటం మర్చిపోతారు. వీళ్ళ ఉద్దేశం ప్రకారం దేశ్ముఖ్ ఒక్కడే దుర్మార్గుడు. ఆ దుర్మార్గానికి అనుసరించిన వాళ్ళు సుద్దపూసలు.
సాయిధ పోరాటంలో వెయ్యి మంది దాకా రెడ్లు ఉద్యమకారులుగా వీరులుగా అమరులుగా ఉన్నారు. వీళ్ల పేర్లు చెదలు పట్టిన చరిత్ర పేజీలో చిరిగిపోయి ఉన్నాయి.
చరిత్రలో పోరాటం చేయని వాళ్లను అందలం ఎక్కిస్తూ.. పోరాట వీరులను పాతాళానికి తొక్కుతూ.. కొత్త రాజకీయ చరిత్రలకు తెర ఎత్తుతూ.. రెడ్డి అనే పదానికి అహంకారం లేదా అశ్లీలం అనే అర్థాన్ని ఇస్తూ.. అభ్యుదయం పేరుతో రెచ్చిపోతున్న గభ్యుదయవాదులను తరిమి కొట్టాల్సిందే.
ఓట్ల కోసం సీట్ల కోసం రెడ్ల చరిత్ర వక్రీకరించబడటంలో కారణమవుతున్న కొందరు రెడ్లను కూడా నిలదీయాల్సిందే..!
ప్రజాస్వామ్య భారతంలో సత్తా ఉన్న ఎవరైనా రాజకీయం చేయవచ్చు. కులాలను ఎత్తి చూపి తూలనాడి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తే నడ్డి విరచాల్సిందే.
ఆత్మాభిమానం.. ఆత్మగౌరవం.. అందరికీ ఉంటుంది. అది ఏ ఒక్క కులం సొత్తో కాదు. కాబట్టి కులాల పేరు ఎత్తితే.. అది రెడ్డి కులమైనా సరే అట్రాసిటీ వర్తించాలి. అన్ని కులాల పేరుకు అట్రాసిటీ వర్తించనంత కాలం కొందరు దగుల్బాజీలు బ్రోకర్లు ‘మేధావులు రచయితలు, రాజకీయ నాయకుల’ ముసుగులో రెచ్చిపోతూనే ఉంటారు.
ఫొటో: తెలంగాణలోని ఓ గడి ముఖద్వారం, దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి (ఇన్ సెట్)