Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

త…త.. తాలిబన్లంటే భయమా!? వీడియో చూసి చెప్పండి!!

దిగువన గల వీడియోను జాగ్రత్తగా చూడండి. ‘తాలిబన్ల ప్రభుత్వాన్ని చూసి ఆప్ఘనిస్థాన్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు…’ అని ఓ న్యూస్ ఛానల్ యాంకర్ చెబుతున్న మాటలు వినిపిస్తున్నాయి కదా? ఈ వాక్యాలు చెబుతున్నపుడు యాంకర్ మాత్రం వణికపోతున్నట్లు మనకు కనిపిస్తుంది.

ఇంతకీ యాంకర్ ఎందుకు వణికిపోతున్నారో గమనించారా? అతనికి వెనకాల అధునాతన తుపాకులు గురిపెట్టి, యాంకర్ ఏం చెబుతున్నదీ గమనిస్తున్న ఇద్దరు తాలిబన్లు కూడా వీడియోలో కనిపిస్తున్నారు… అదీ అసలు సంగతి. ఓ న్యూస్ ఛానల్ స్టూడియోలోకి చొరబడిన తాలిబన్లు తమ పాలన గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలని తుపాకీ గురిపెడితే యాంకర్ మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? చెప్పక ఛస్తాడా??

అందుకే వణుకుతూనే తాలిబన్ల పాలనకు ప్రజలు భయపడవద్దని సెలవిస్తున్నాడు. ఇరాన్ కు చెందిన ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఆఫ్ఘనిస్థాన్ లో పలువురు జర్నలిస్టులపై, వారి కుటుంబాలపై తాలిబన్లు దాడులకు తెగబడుతూ, హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా వీడియో చర్చనీయాంశంగా మారింది.

Popular Articles