Top 5 This Week

Related Posts

ఔను… ఎమ్మెల్సీ ‘ట్రయల్స్’ నిజమే: పీవీ శ్రీనివాస్ వెల్లడి

తాను ఎమ్మెల్సీ టికెట్ ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవమేనని టీ న్యూస్ ఇన్ పుట్ ఎడిటర్ పీవీ శ్రీనివాస్ వెల్లడించారు. ‘పీవీ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ‘ట్రయల్స్’!? శీర్షికన కొద్ది గంటల క్రితం ts29 ప్రచురించిన వార్తా కథనంపై ఆయన స్పందించారు.

ఈమేరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడుతూ, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసే యోచన తనకు ఉందన్నారు. ‘ఎక్కడో ఓ చోట వే ఔట్’ కావలసిందే కదా? అని శ్రీనివాస్ అన్నారు.

సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి రామన్న (కేటీఆర్)తో టచ్ లో ఉన్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. తన ప్రయత్నాల్లో తాను ఉన్నానని, అవకాశం లభిస్తే అందరి సహకారం కావాలని కూడా శ్రీనివాస్ ఈ సందర్భంగా అభ్యర్థించారు.

Popular Articles