Top 5 This Week

Related Posts

‘నామ’ కుటుంబానికి ఎంపీల పరామర్శ

లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మ పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పరామర్శించారు. నామ నాగేశ్వరరావు మాతృమూర్తి నామ వరలక్ష్మి ఇటీవల మరణించిన విషయం విదితమే. టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు శనివారం ఖమ్మం నెహ్రూ నగర్ లోని ఎంపీ నామ నివాసానికి వచ్చి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

నామ నాగేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన వరలక్ష్మి చిత్ర పటానికి పలువురు ఎంపీలు పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపీ నామ నాగేశ్వరరావును, ఆయన సోదరులు నామ రామారావు, నామ సీతయ్య, నామ కృష్ణయ్యలతో మాట్లాడి, పరామర్శించారు.

నామ నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, చేవెళ్ల ఎంపీ డా. గడ్డం రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్,పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతలతోపాటు ఇతర టీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు.

ఫొటో: నామా వరలక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు, చిత్రంలో నామా నాగేశ్వరరావు కూడా ఉన్నారు.

Popular Articles