తెలంగాణా రాష్ట్రంలో సుమారు నాలుగున్నరేళ్ల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన అడ్వకేట్స్ గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పునిచ్చింది. వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కూడా పేర్కొంది. ఈ ఘటనలో మరణవాంగ్మూలం వీడియో అసలైనదేనని ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలలో కేసును పరిశీలించి దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. తమ కుమారుడు, కోడలు హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వామన్ రావు తండ్రి సుప్రీంకోర్టులో పిటిన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల కథనాన్ని దిగువన గల లింక్ ద్వారా మరోసారి చదవవచ్చు..
