జర్నలిస్టులు సహా వివిధ వర్గాలకు చెందినవారికి ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంలో దాఖలైన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేసన్ పరిధిలో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, సివిల్ సర్వెంట్లకు, జడ్జిలకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి హౌజింగ్ సొసైటీలకు ప్రాధాన్యతా కేటాయింపును రద్దు చేస్తూ గత నవంబర్ లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాఖలైన రివ్యూ పిటిషన్లపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. తాజా పరిస్థితుల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించి చివరి ఆశ ఇంకా ఒకటి మిగిలే ఉందని సీనియర్ జర్నలిస్టులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘క్యూరేటివ్’ పిటిషన్ దాఖలకు అవకాశం మిగిలే ఉందని, అయితే ఇందులో యాభై శాతం మాత్రమే సానుకూల పరిస్థితులు ఉండవచ్చని చెబుతున్నారు. క్యూరేటవ్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైతే ఇళ్ల స్థలాలపై జర్నలిస్టులు సహా ఆయా వర్గాలు ఆశలు వదులుకోవలసిందేనని వారు పేర్కొంటున్నారు.
