Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

తెలంగాణా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్

తెలంగాణా ప్రభుత్వ వ్యవహార తీరుపై దేశ అత్యున్నత ధర్మాసనం ఆగ్రహించింది. ముఖ్యంగా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సర్కారు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ భూములకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు చర్యలన్నీ నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచ గచ్చబౌలి భూముల అంశంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఈ భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మధ్యాహ్నం తెలంగాణా హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను సమర్పించారు. దీన్ని పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారని సర్కార్ ను ప్రశ్నించింది. తమ ప్రశ్నలకు చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

Popular Articles