Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘ఐపీఎస్’ల ఆకస్మిక బదిలీ

ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఆకస్మిక బదిలీ చేసింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న వీబీ కమలాసన్ రెడ్డిని బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కరీంనగర్ సీపీగా రామగుండం సీపీ సత్యనారాయణను బదిలీ చేస్తూ, రామగుండం సీపీగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రమణ కుమార్ ను నియమించారు. రమణకుమార్ ప్రస్తుతం నాన్ కేడర్ ఎస్పీగా ఉన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి బదిలీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఫొటో: కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి

Popular Articles