Top 5 This Week

Related Posts

‘యెల్లో’ మీడియాపై సుబ్రహ్మణ్యం స్వామి సంచలన ప్రకటన

‘యెల్లో’ మీడియాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే అభివర్ణించే చంద్రబాబునాయుడి అనుకూల పత్రికల వ్యవహార తీరుపై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి సంచలన ప్రకటన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై చంద్రబాబు అనుకూల మీడియాలో వస్తున్న వార్తా కథనాల పట్ల తాను విసిగిపోయినట్లు చెప్పారు. అందుకే చంద్రబాబుపై, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పత్రికలపై పరువు నష్టం దావా దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంలో తన సహచరుడు సత్యపాల్ సభర్వాల్ తో కలిసి త్వరలోనే తిరుపతి పట్టణ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించనున్నట్లు సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

Popular Articles