Top 5 This Week

Related Posts

జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్ల దాడి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయణిస్తున్న కాన్వాయ్ పై గురువారం రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కోల్ కతాలోని డైమండ్ హార్బర్ కు నడ్డా ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానిక బీజేపీ నేతలు ఆరోపించారు. కొద్ది నెలల్లోనే బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. దాడికి సంబంధించి బీజేపీ బెంగాల్ నేతలు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను దిగువన చూడవచ్చు.

Popular Articles