యాదగిరిగుట్టలో రెడ్డి భవనానికి శంకుస్థాపన చేయమని కోరితే ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇతర వర్గాలను దృష్టిలో పెట్టుకుని శంకుస్థాపన చేయకుండా వెళ్ళిపోయాడు.
తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమ గీతం పాడమని అడిగితే ఇతర ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ గీతాన్ని
పాడలేకపోయాడు.
రాముడికి వ్యతిరేకంగా పాట చేయమని తమిళనాడు ప్రభుత్వం కోరితే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఇళయరాజా అటువంటి గీతాలు చేయనని నిరాకరించాడు. ప్రజల మనుషులకు.. ప్రజా కళాకారులకు.. కొన్ని నిబంధనలు పరిమితులు ఉంటాయి.
మొత్తానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తెలంగాణ ప్రాంతంలో ఉండకూడదు?????
ఉండకూడదు అంటున్నది ఎవ్వరు?
యావత్ తెలంగాణ ప్రజలా?
వివిధ వర్గాలుగా విడిపోయి ఉన్న సమిష్టి ఉద్యమకారులా?
లేక
తమిళ పెరియార్ ముసుగేసుకుని తెలంగాణ వాదాన్ని ముందేసుకున్న ఉద్యమకారులా?
ఉమ్మడి రాజధాని ప్రాంతంగా కొనసాగిన హైదరాబాదులో రాజకీయ సాంస్కృతిక వైభవంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాలకు చెందిన కవుల కళాకారుల రాజకీయ నాయకుల విగ్రహాలు చరిత్ర అధ్యయనంలో భాగంగా ఇక్కడ కనిపిస్తాయి.
ప్రస్తుతం ప్రత్యేక తెలంగాణ ప్రాంతంగా విడిపోయిన హైదరాబాద్ ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు చెందిన సంఘసంస్కర్తలు జ్యోతి రావు పూలే / సావిత్రి బాయి పూలే విగ్రహాలు, హిందూ రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజు విగ్రహాలు, హిందూ యోగి వివేకానందుడి విగ్రహాలు నెలకొల్పడంలో ఎటువంటి వివాదం లేదు.
అట్లాగే- భారత జాతీయ స్వతంత్ర సంగ్రామకాలంలో తెలంగాణ నిజాం ఏలుబడిలో ఉన్నది. తెలంగాణ స్వతంత్రం కోసం సాయుధ పోరాటం జరిగింది. కానీ సాయిధ పోరాట వీరుల విగ్రహాలు ఎక్కడా కనబడవు. భారత స్వతంత్ర పోరాట యోధుల విగ్రహాలు హైదరాబాద్ లో కనిపిస్తాయి.
బాలసుబ్రమణ్యం ఎందుకు వివాదం అవుతున్నాడు?
తెలంగాణ గీతం పాడలేదనా?
ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడనా?
తెలంగాణ గీతం పాడలేదు అనడానికి ఓ కారణం ఉన్నది..
ఆంధ్ర ప్రాంతం దృష్టిలో చూస్తే మాత్రం తెలంగాణ ప్రాంతంలో నెలకొల్పబడిన ఇతర ప్రాంతాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన విగ్రహాలు తెలంగాణ ఆస్తిత్వ వాదంపై అనేక ప్రశ్నల్ని సంధిస్తాయి..

✍ డా. తంగెళ్ల శ్రీదేవిరెడ్డి

