శ్రీరామ నవమి పర్వదినం వేళ భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతమ్మవారి మెడలో రాములవారు మాంగళ్య ధారణ చేశారు. పట్టణంలోని మిథిలా స్టేడియంలో రామయ్య కళ్యాణ క్రతువును ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచేగాక అటు ఛత్తీస్ గఢ్, ఒడిషా తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖయలో హాజరయ్యరు.

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో రాములోరి పెళ్లికి హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు కూడా పాల్గొన్నారు.
