డబ్బుంటే సరిపోదు.. సంపాదించిన మొత్తంలో సొంతూరి ప్రజల కోసం ఖర్చు చేసే ఔదార్యం చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటి కొద్ది మందిలో ఖమ్మం నగరానికి చెందిన శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి ఉండడం విశేషం. సామాన్యుడి నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించిన వత్సవాయి రవి తన స్వగ్రామ ప్రజల మేలు కోసం ఉచిత మినరల్ వాటర్ ప్లాంటును నెలకొల్పి పలువురి ప్రశంసలను అందుకున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొనవనమాలకు చెందిన వత్సవాయి రవి తపనను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అభినందించడం మరో విశేషం.
కొనవనమాల గ్రామంలో సొంతూరి ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి వత్సవాయి రవి సేవాభావాన్ని కొనియాడారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కోసం తాను తొలిసారిగా ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి చెప్పారు. సేవా కార్యక్రమాల కొనసాగింపులో భాగంగా శుక్రవారం వాసన్ ఐ కేర్ ఆసుపత్రి సహకారంతో ఖమ్మంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వత్సవాయి రవి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, బొర్రా రాజశేఖర్, కొణిజర్ల మాజీ ఎంపీపీ గోసు మధు, శ్రీ బాలాజీ ఎస్టేట్స్ ఇంచార్జ్ పోగుల రవి కుమార్, డైరెక్టర్స్ షేక్ తాజుద్దీన్, కాసాని శ్రీశైలం, గాలి నారాయణ, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.