Top 5 This Week

Related Posts

కల్తీ పాల కేంద్రాలపై ఎస్వోటీ పోలీసుల దాడి

భువనగిరి జోన్ పరిధిలోని కల్తీ పాల కేంద్రాలపై ఎస్ఓటి పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన ఈ దాడుల్లో కల్తీ పాలను, వాటి తయారీకి వినియోగించే కెమికల్స్ ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే మొన్నేవరిపంపు గ్రామంలో 80 లీటర్ల కల్తీ పాలను, 500 మి.లీ. హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్, 5 మిల్క్ పౌడర్స్ పాకెట్లను ,400 మి.లీ. యాసిటిక్ యాసిడ్ లను స్వాధీనం చేసుకున్నారు. సామల సత్తిరెడ్డి అనే వ్యక్తి కల్తీ పాలను తయారు చేసి ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి భువనగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు.

అదేవిధంగా మరో ఘటనలో భువనగిరి మండలం కనుముక్కల గ్రామంలో కల్తీ పాల కేంద్రంపై కూడా ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. రఘు అనే వ్యక్తి కల్తీ పాలను తయారు చేసి మలక్ పేట, దిల్ సుఖ్ నగర్ స్వీటు షాపులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు రఘును అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 100 లీటర్ల కల్తీ పాలు, 200 మి.లీ. హైడ్రోజన్ పెరాక్సైడ్, ఏడు పాలపొడి పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రఘును అరెస్ట్ చేసిన ఎస్వోటీ సిబ్బంది అతన్ని పోచంపల్లి పోలీసులకు అప్పగించారు.

Popular Articles