Top 5 This Week

Related Posts

సోనియా రాజీనామా!?

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేశారా? రేపు (సోమవారం) జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముందే ఆమె పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారా? ఈ అంశంపై పార్టీపరంగా ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, ఆమె తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు జాతీయ మీడియాలో భారీ ఎత్తున వార్తలు వస్తున్నాయి.

సోమవారం జరిగే కీలకమైన పార్టీ సమావేశానికి ముందు సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి వైదొలగవచ్చనేది జాతీయ మీడియా వార్తల సారాంశం. రేపు జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి వైదొలగడంపై సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సోనియా రాజీనామా చేశారనే వార్తలు వస్తుండగా, ఇదే దశలో పార్టీకి కొత్త నేతను ఎన్నుకోవాలని సోనియా గాంధీ సూచించినట్లు ఆమె పేరుతో వస్తున్న ప్రకటనలు కల్పితమని కాంగ్రెస్ నేత సూర్జేవాలా పేర్కొనడం గమనార్హం.

Popular Articles