Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

అయ్య బాబోయ్… ఆంధ్రాలో ఇన్ని రాజధానులు పెట్టొచ్చన్నమాట!

సోషల్ మీడియాలో చిల్లర, మల్లర అంశాల పోస్టులే కాదు, కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. వర్తమాన అంశాలతో కూడిన అనేక పోస్టులు పఠనాసక్తినీ కలిగిస్తాయి. ఆంధప్రదేశ్ రాజకీయాల్లో మూడు రాజధానుల అంశం అనేక పరిణామాల చుట్టూ పరిభ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ సోషల్ మీడియా పోస్ట్ వాట్సాప్ గ్రూపుల్లో తెగ తిరుగుతోంది. ఓ రాష్ట్రంలో ఇన్నేసి విభాగాలను ప్రామాణికంగా తీసుకుని ఆయా కేంద్రాల్లో రాజధానాలు ఏర్పాటు చేయవచ్చనే భావనను ఈ పోస్టులో వెటకారంగా వ్యక్తీకరించినట్లు కనిపిస్తోంది. అమరావతి రాజధాని తరలింపునకు సుముఖంగా లేని తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలెవరో దీన్ని తయారు చేశారు కాబోలు. అభ్యంతకరంగా ఉన్న ఒకటీ, అరా రాజధానులను ‘ఎడిట్’ చేసిన ఆయా సోషల్ మీడియా పోస్టును దిగువన సరదాగా చదివేయండి మరి.

ఓమంత్రి గారు మాట్లాడుతూ,
33 రాజధానులైనా చెయ్యొచ్చునని వక్కాణించారు…

వారికి అందచేద్దామని
కొన్ని పేర్లతో ఈ జాబితా తయారు చేశారు ఔత్సాహికులు

ఇంకా చాలా ఉన్నాయి..
మీరు కూడా కొన్ని అందిస్తే
తుది జాబితా తీర్చి దిద్దుతారట..?

     *****

ఆధ్యాత్మిక రాజధానిగా
“తిరుపతి”

అందాల రాజధానిగా
“అరకు”

మామిడి రాజధానిగా
“నూజివీడు”

కొబ్బరి రాజధానిగా
“అమలాపురం”

పూతరేకుల రాజధానిగా
“ఆత్రేయపురం”

కాజాల రాజధానిగా
” కాకినాడ”

మడత కాజాల రాజధానిగా
“తాపేశ్వరం”

తొక్కుడు లడ్డు రాజధానిగా
“బందరు”

మిరపకారం రాజధానిగా
“గుంటూరు”

విలువల రాజధానిగా
“విజయవాడ”

బొమ్మల రాజధానిగా
“కొండపల్లి”

గిత్తల రాజధానిగా
“ఒంగోలు”

కిడ్నీ వ్యాధుల రాజధానిగా
“ఉద్ధానం”

జీడిపప్పు రాజధానిగా
“పలాస”

కోడి పందాల రాజధానిగా
“భీమవరం”

ఎడ్ల పందాల రాజధానిగా
“గుడివాడ”

ఆశ్రమ రాజధానిగా
“అనంతపురం”

తుఫాన్ల రాజధానిగా
“దివిసీమ”

విమానాల రాజధానిగా
“గన్నవరం”

రోజ్ మిల్క్ రాజధానిగా
“రాజమహేంద్రవరం”

అరటి పండ్ల రాజధానిగా
“రావులపాలెం”

హార్బర్ రాజధానిగా
“విశాఖపట్నం”

నాటకాల రాజధానిగా
“చిలకలూరిపేట”

ఫ్యాక్షన్ రాజధానిగా
“పులివెందుల”

బెట్టింగ్ రాజధానిగా
“నెల్లూరు”

కళల రాజధానిగా
“కూచిపూడి”

వస్త్ర వ్యాపార రాజధానిగా
“చీరాల”

చేపల రాజధానిగా
“సూర్యలంక”

బాదంపాల రాజధానిగా
“తుళ్లూరు”

Popular Articles