Top 5 This Week

Related Posts

ఆడా, మగా తేడా లేనే లేదు… తెలంగాణాలోనూ అవే సీన్లు!

ఔను… ఆడా లేదు… మగా లేదు. ఆల్ ఆర్ ఈక్వల్. క్వార్టర్లే కాదు… కార్టన్లకు కార్టన్లు లిక్కర్ మోసుకువెడుతున్నారు. బీరు, బ్రాందీ తేడా లేనే లేదు. ఎవరికి ఏ బ్రాండ్ అవసరమో అది తీసుకుని వెడుతున్నారు. తెలంగాణాలో బుధవారం నుంచి తెరుచుకున్న లిక్కర్ షాపుల ముందు కనిపించిన దృశ్యాలివి. వైన్ షాపులు ఓపెన్ చేయనున్నట్లు మంగళవారం రాత్రి పొద్దుపోయాక సీఎం కేసీఆర్ ప్రకటించారో లేదో… బుధవారం ఉదయాన్నే మద్యపాన ప్రియులు వైన్ షాపుల ముందు తచ్చాడడం కనిపించింది. లాక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా? అంటూ ఎదురు చూశారు. ఉదయం తొమ్మిది గంటలకల్లా వైన్ షాపుల ముందు లిక్కర్ బాబుల క్యూ చాంతాడులా పెరిగిపోతూనే ఉంది. పురుషులే కాదు… మహిళలు సైతం ఎటువంటి సంకోచం లేకుండా ఎంచక్కా ‘మందు’ సీసాలు పట్టుకెడుతున్న సీన్లు దిగువన స్లైడ్ షోలో చూడవచ్చు.

Popular Articles