Top 5 This Week

Related Posts

వివాదంలో సింగర్ మంగ్లీ!

​గాయని మంగ్లీ వివాదంలో చిక్కుకున్నారా?
కారణం అశ్లీలమా? లేక ఆరాధ్య దైవాల ప్రస్తావనా?
ఆమె పాడిన” సర్కే చునర్ తేరి సర్కే” పాటలో ఏం బూతు ఉన్నది?
పరిశీలిద్దాం!

కన్నడ హీరో ధ్రువ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘KD – The Devil’. ఈ సినిమాలో 70ల నాటి రెట్రో స్టైల్‌లో సాగే మాస్ ఐటెం సాంగ్ సర్కే చునర్ తేరి సర్కే..ఈ పాటను తెలుగు, కన్నడ, హిందీ, తమిళం మలయాళ భాషల్లో విడుదల చేశారు. సంజయ్ దత్ ఈ సినిమాలో ‘సీనియర్ ఆంటోనీ’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.

సర్కే చునర్ తేరి సర్కే పాట (తెలుగు అనువాదం)

•​పల్లవి:

నీ పైట జారుతోంది.. నీ పైట జారుతోంది.. నా కళ్లు నీపైనే ఆగిపోయాయి
నీ పైట జారుతోంది.. నీ పైట జారుతోంది.. నా కళ్లు నీపైనే ఆగిపోయాయి
ఆగిపోయాయి.. నా కళ్లు నీపైనే ఆగిపోయాయి..!!
​హే.. నా బాబు.. హే.. నా బాబు..
గులాబీ పెదవులున్న నా బాబు.. చూడు ఎలా చిక్కుకుపోయాడో
నీ పైట జారుతోంది.. నా కళ్లు నీపైనే ఆగిపోయాయి

•​చరణం 1:

నీ గ్లామర్ అటాక్ అద్భుతాలు చేస్తోంది
నా మనసులోని దారినంతా బిజీ బిజీ చేసేశావు
నీ నడక చూస్తుంటే.. నీ గ్లామర్ అటాక్ అద్భుతాలు చేస్తోంది
నా మనసులోని దారినంతా బిజీ బిజీ చేసేశావు
​నీ ముఖాన్ని చూడగానే.. నా గుండె వేగం పెరిగిపోయింది
నీ నడుము అలా తిప్పగానే.. నా ప్రతి కోరిక నెరవేరిపోయింది
హే.. నా బాబు.. హే.. నా బాబు..
పదవే రాణి.. నువ్వు నా రాధవవ్వు, నేను నీ కృష్ణుడినవుతాను

•​చరణం 2:

ఈ ఉరకలేసే యవ్వనం.. ఝుమ్మంటూ పాడుతోంది
నీ జ్ఞాపకాల కథ.. గుబాళిస్తోన్న పరిమళంలా ఉంది
ఈ ఉరకలేసే యవ్వనం.. ఝుమ్మంటూ పాడుతోంది
నీ జ్ఞాపకాల కథ.. గుబాళిస్తోన్న పరిమళంలా ఉంది
​హే ముసుగును.. కాస్త తొలగించు.. నీ అందపు వెలుగులు పరుచుకున్నాయి
నువ్వు నా తోడుంటే.. నా బాధలన్నీ దూరమైపోతాయి
హే.. నా బాబు.. హే.. నా బాబు..
నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా? నేను నీ ప్రేయసిని
​నీ పైట జారుతోంది.. నా కళ్లు నీపైనే ఆగిపోయాయి
నీ పైట జారుతోంది.. నా కళ్లు నీపైనే ఆగిపోయాయి..!!

తెలుగు సినిమా సాహిత్యంలో గతంలోనూ, ప్రస్తుతం కూడా ఇంతకంటే ఘాటైన శృంగార పదజాలం ఉన్న పాటలు అనేకం వచ్చాయి. వస్తున్నాయి.. మరి ఈ పాట ఎందుకు వివాదం అయింది?

వాస్తవం :
KD – The Devil’ సినిమాలోని ఈ పాట విషయంలో గాయని మంగ్లీపై , చిత్ర బృందంపై వివాదం తలెత్తడానికి ప్రధాన కారణం పాటలోని “బూతు పదాల” వల్ల కాదు. సంస్కృతి పరమైన మతపరమైన భావాలు దెబ్బతిన్నాయనేది ప్రధాన కారణం! ఈ పాట విషయంలో వివాదం కేవలం ‘పదాల’ మీద కాకుండా, ఆ పదాలను ఏ ‘సందర్భంలో’ వాడారు అనే దానిపైనే కేంద్రీకృతమైంది.

1)​ పాటలో ఒక సందర్భంలో హిందూ దేవతా మూర్తుల పేర్లను చిహ్నాలను అభ్యంతరకర రీతిలో వాడారని కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

2) దైవత్వాన్ని ఇలాంటి వాణిజ్యపరమైన మాస్ పాటలతో ముడిపెట్టడాన్ని సంప్రదాయవాదులు సహించలేకపోతున్నారు.

3) ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికెట్, అలాగే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేశారు.

4) రాధా-కృష్ణుల ప్రస్తావనను ఒక ఐటెం సాంగ్లో వాడటం సరి కాదని వాదనలు వినిపించాయి.

5) కర్ణాటకకు చెందిన కొన్ని హిందూ సంఘాలు కూడా ఈ పాట విషయంలో స్పందిస్తూ…ఈ పాటలో చూపించిన రెట్రో స్టైల్ కన్నడ సంస్కృతిని ప్రాంతీయ ఆచారాలను కించపరిచే విధంగా ఉందని ఆరోపించాయి.

Popular Articles