Top 5 This Week

Related Posts

తెలంగాణా హైకోర్టు సంచలన తీర్పు

అక్రమ మార్గంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ పిటిషనర్ కు తెలంగాణా హైకోర్టు బిగ్ షాక్ నిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని నిర్ధారిస్తూ పిటిషనర్ వెంకట్రామిరెడ్డికి రూ. కోటి మొత్తాన్ని జరిమానాగా విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక మంగళవారం సంచలన తీర్పును వెలువరించారు.

రాజధానిలోని బండ్లగూడ జాగీర్ భూములకు సంబంధించి ఓ పిటిషన్ హైకోర్టులో పెండింగులో ఉంది. ఈ విషయాన్ని దాచిపెట్టి మరో బెంచ్ వద్ద ఇంకో పిటిషన్ దాఖలు చేసి ఆర్డర్ తీసుకోవడంపై జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహించారు. ఈ అంశంలో ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా పిటిషన్లు దాఖలు చేయడంపై ఆయన సీరియస్ అయ్యారు.

ఈ పరిణామాల్లో పిటిషనర్ వెంకట్రామిరెడ్డికి కోటి రూపాయల జరిమానా విధిస్తూ సంచలనాత్మక తీర్పునిచ్చారు. ఇది అత్యంత భారీ జరిమానాగా న్యాయవాద వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Popular Articles