Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

పోక్సో కేసులో ఉరిశిక్ష: నల్లగొండ కోర్టు సంచలన తీర్పు

పదకొండేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధించడంతోపాటు బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని నల్లగొండ పోక్సో కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015 ఏప్రిల్ 28వ తేదీన జరిగిన ఈ ఘటనలో మహ్మద్ ముక్రం అనే వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలికను హత్య చేసి మృతదేహాన్ని కాల్వలో పడేశాడు.

కేసులో నిందితుడైన మహ్మద్ ముక్రంపై పోలీసులు ఐపీసీ 386-ఏ, 302, 201, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసులో వాదోపవాదనలు ముగిశాక, సాక్ష్యాధారాలను పరిశీలించిన నల్లగొండ కోర్టు పోక్సో కోర్టు నిందితుడైన మహ్మద్ ముక్రంను దోషిగా నిర్ధారించింది. ఈమేరకు పోక్సో కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి రోజారమణి మహ్మద్ ముక్రంకు ఉరిశిక్షతోపాటు రూ. 1.10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ. 10.00 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు తీర్పు చెప్పింది.

Popular Articles