Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ ముగిసిన అనంతరం తమిళిసై ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ, పాలక పెద్దల వ్యవహార శైలిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తనను కావాలనే అవమానిస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. గవర్నర్ ఇంకా ఏమన్నారంటే…

• సీఎం కేసీఆర్‌ను నేను అన్నగా భావించాను.
• కానీ, నా తల్లి రాజ్ భవన్ లో చనిపోయినా.. కేసీఆర్ పరామర్శించలేదు.
• తెలంగాణ వ్యవహారాలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారు.
• తెలంగాణలో డ్రగ్స్ కేసు, అవినీతిపై మోదీ, అమిత్‌షాలకు నివేదిక ఇచ్చాను.
• డ్రగ్స్‌ తో యువత నాశనం అవుతున్నారు, ఓ తల్లిగా బాధపడుతూ మోదీకి నివేదిక ఇచ్చాను.
• గవర్నర్లతో విభేదించిన ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, మమత కూడా.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచేవారు.
• తెలంగాణలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉంది.
• యూనివర్సిటీలో 60 శాతం ఖాళీలు ఉన్నాయి, కానీ, ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారు.
• ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం… గవర్నర్‌గా నాకుంది.
• కానీ, నేను ఆ పని చేయను. తెలంగాణ ప్రభుత్వంపై నాకెలాంటి కోపం లేదు.

Popular Articles