Top 5 This Week

Related Posts

సీనియర్ జర్నలిస్ట్ మారుతీ ప్రసాద్ ఇక లేరు!

సీనియర్ జర్నలిస్టు ఎం. మారుతీ ప్రసాద్ ఇక లేరు. గత రాత్రి పొద్దుపోయాక ఆయన గుండె పోటుతో మరణించారు. దాదాపు నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం పాలైన మారుతీ ప్రసాద్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం రాత్రి ఆయనకు తీవ్ర గుండె పోటు రావడంతో వైద్యులు చికిత్స చేస్తుండగానే తుదిశ్వాస విడిచారు.

మారుతీ ప్రసాద్ దాదాపు నలబై సంవత్సరాలుగా జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్, గుంటూరు, ఒంగోలు, నల్లగొండ వంటి జిల్లాల్లో ఉదయం, వార్త తదితర పత్రికల్లో పనిచేసిన సమయంలో ఆయన అనేక సంచలనాత్మక, పరిశోధనాత్మక వార్తా కథనాలను రాశారు. మారుతీ ప్రసాద్ కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మారుతీ ప్రసాద్ దాదాపు పాతిక సంవత్సరాలుగా హైదరాబాద్ లోని అంబర్ పేటలో నివాసం ఉంటున్నారు. మారుతీ ప్రసాద్ మరణం పట్ల ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ, ts29.in ఆయనకు నివాళి అర్పిస్తోంది.

Popular Articles