Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

యువతి హత్య కేసులో జీవిత ఖైదు

యువతి హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు పది వేల రూపాయల జరిమానా విధిస్తూ సత్తుపల్లి 6వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి యం. శ్రీనివాస్ తీర్పునిచ్చారు.

సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తలింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. 2020 సంవత్సరంలో పెనుబల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన యువతి హత్య కేసును అప్పటి అధికారులు దర్యాప్తు చేసి చార్జ్‌షీట్‌ను సమర్పించారు. కేసులో వాదోపవాదనలు విన్న న్యాయాధికారి యం.శ్రీనివాస్ గురువారం నిందితుడైన సత్తుపల్లికి చెందిన బోల్లేడు నితిన్ (20) ను దోషిగా నిర్ధారిస్తూ అతనికి జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధించారు.

ఈ కేసులో నిందితుడికి శిక్షపడే విధంగా పని చేసిన అప్పటి సీఐలు సురేష్ కుమార్, రవికుమార్, కరుణాకర్, ప్రస్తుత సిఐ మత్తు లింగయ్య, పెనుబల్లి ఎస్సై వెంకటేశ్, ఏపీపీ అబ్దుల్ బాషా, కోర్టు కానిస్టేబుల్ గిరిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Popular Articles