Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

మామ, కోడలు వివాహేతర సంబంధం, కూతురు హత్య: జీవిత ఖైదు

తమ వివాహేతర సంబంధాన్ని చూసిందనే కారణంతో 11 ఏళ్ల చిన్నారిని హత్య చేసిన మామ, కోడలుకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నాలుగో అదనపు కోర్టు న్యాయమూర్తి ఎం. శ్రీనివాసరావు సోమవారం తీర్పు చెప్పారు. జిల్లా పోలీస్ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం..

జిల్లాలోని బోనకల్ గ్రామానికి చెందిన పాలేపు సునీత (32) అనే వివాహిత తన మామ, భర్త తండ్రి అయిన పాలేపు నరసింహారావు (65)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ట్రాలీ డ్రైవర్ గా పనిచేస్తున్న తన భర్త హరికృష్ణ 2022 పిబ్రవరి 8న బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో సునీత తన మామ నరసింహారావుతో శారీరక సంబంధంతో కలిసి వుండగా పెద్ద కుమార్తె చూసింది. దీంతో కుమార్తెను ఎలాలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్ధేశంతో 11 ఏళ్ల చిన్నారి మెడకు వైరు బిగించి చంపారు.

అనంతరం తన భర్తకు సునీత ఫోన్ చేసి పెద్ద కుమార్తె ఆరోగ్యం బాగోలేదని చెప్పి, 108 అంబులెన్స్ లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించడంతో పోస్ట్ మార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే హాస్పిటల్ కు చేరుకున్న భర్త హరికృష్ణ కూతురు మెడపై నల్లగా కమిలినట్లు కనిపించడంతో బోనకల్ పోలీస్ స్టేషన్ లో 2022 పిబ్రవరి 9న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాలేపు సునీత, నరసింహారావులను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఈ కేసు పూర్వపరాలను, సాక్ష్యాధారాలను, పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి ఎం. శ్రీనివాసరావు నిందితులైను సునీత, నరసింహారావులును దోషులుగా నిర్ధారిస్తూ వారిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. కేసులో ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ ఎస్ కె అబ్దుల్ పాషా వాదించగా, విచారణ అధికారులుగా వ్యవహరించిన సత్తుపల్లి సీఐ మురళి, ఎస్ఐ కవిత, కోర్టు కానిస్టేబుల్ బి. అరవింద్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ లను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Popular Articles