హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణా ప్రభుత్వం సంక్రాంతి కానుకగా డీఏను 3.64 శాతం పెంచింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వును జారీ చేసింది. పెంచిన డీఏ 2024 జూలై 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. జనవరి నెల వేతనంతో పెంచిన డీఏను ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీన చెల్లించనుంది. అదేవిధంగా 2023 జూలై 1వ తేదీ నుంచి గత డిసెంబర్ 31 వరకు గల డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది.

